తలకాయ కూర

ABN , First Publish Date - 2022-05-14T23:15:58+05:30 IST

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌వైపు మనసు లాగేస్తుంది. అయితే వీకెండ్‌లో జిహ్వచాపల్యం తీరాలంటే మటన్‌తో ఇలాంటి వంటలను ట్రై చేయండి.

తలకాయ కూర

వీకెండ్‌లో... మటన్‌ మస్తీ!

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌వైపు మనసు లాగేస్తుంది. అయితే వీకెండ్‌లో జిహ్వచాపల్యం తీరాలంటే మటన్‌తో ఇలాంటి వంటలను ట్రై చేయండి.


కావలసినవి: మేక తలకాయ మాంసం - అరకేజీ, కొత్తిమీర - ఒకకట్ట, గరంమసాల - ఒక టీస్పూన్‌, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, నల్ల జీలకర్ర - పావు టీస్పూన్‌.


తయారీ విధానం: స్టవ్‌పై కుక్కర్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేయాలి. కాసేపు వేగిన తరువాత తలకాయ మాంసం వేయాలి. తగినంత ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.ఆవిరిపోయిన తరువాత కూరను పాన్‌లోకి మార్చుకుని మళ్లీ స్టవ్‌పై పెట్టాలి. మిరియాల పొడి, ధనియాల పొడి, గరంమసాల, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి.కాసేపు ఉడికిన తరువాత కొత్తిమీర వేసి దింపుకోవాలి.

Read more