ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మటన్‌ రోస్ట్‌

ABN, First Publish Date - 2022-05-14T18:45:41+05:30

మటన్‌ - అరకేజీ, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, అల్లం - రెం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలసినవి: మటన్‌ - అరకేజీ, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, అల్లం - రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, కారం - ముప్పావు టీస్పూన్‌, ధనియాల పొడి - పావు టీస్పూన్‌, గరంమసాల - అరటీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి మిరియాల పొడి, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.మొదటి విజిల్‌ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరిపోయాక మటన్‌ను ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. సోంపు, దంచిన అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేయాలి.కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలపాలి. కాసేపు వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసి మరో రెండుమూడు నిమిషాలు ఉడకనివ్వాలి.ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని వేయాలి. పెద్ద మంటపై కాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!