మాల్పువా

ABN , First Publish Date - 2022-05-13T21:34:27+05:30 IST

గోధుమ పిండి- కప్పు, చక్కెర - కప్పు, పెరుగు- రెండు స్పూన్లు, బేకింగ్‌ సోడ- పావు స్పూను,

మాల్పువా

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- కప్పు, చక్కెర - కప్పు, పెరుగు- రెండు స్పూన్లు, బేకింగ్‌ సోడ- పావు స్పూను, బాదం, పిస్తా, జీడిపప్పు రేకులు- పావు కప్పు, నూనె లేదా నెయ్యి, నీళ్లు, ఉప్పు - తగినంత, యాలకుల పొడి- చిటికెడంత.


తయారుచేసే విధానం: పెద్ద గిన్నెలో గోధుమ పిండి, రెండు స్పూన్ల చక్కెర, పెరుగు, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. క్రమంగా నీళ్లు కలుపుతూ జారు పిండిలా చేసుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మిగతా చక్కెరకు తగినంత నీటిని కలిపి తీగ పాకం వచ్చేవరకు వేడిచేసి యాలకుల పొడి కలిపి పక్కన పెట్టాలి. పాన్‌పై నెయ్యి వేసి మధ్యలో గరిటెడు పిండివేసి రెండు వైపులా దోరగా కాల్చి చక్కెర పాకంలో అర నిమిషం పాటు ముంచేసి తీసేస్తే మాల్పువా రెడీ.  పైన డ్రైఫ్రూట్స్‌ రేకుల్ని అలంకరించాలి.

Read more