కైరీ మ్యాంగో కర్రీ

ABN , First Publish Date - 2022-05-07T22:42:25+05:30 IST

మామిడికాయలు - అరకేజీ, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకులు - రెండు, ఇంగువ - అర టీస్పూన్‌

కైరీ మ్యాంగో కర్రీ

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - అరకేజీ, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకులు - రెండు, ఇంగువ - అర టీస్పూన్‌, శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ విధానం: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై కడాయిపెట్టి ఆవాల నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, సోంపు వేయాలి.తరువాత బిర్యానీ ఆకు, పసుపు, ఇంగువ, కారం, ధనియాల పొడి, శనగపిండి వేసి కలుపుకోవాలి.ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించుకోవాలి.తరువాత బెల్లం వేసి పూర్తిగా కరిగే వరకు ఉంచుకుని దింపుకోవాలి.సర్వింగ్‌ డిష్‌లోకి మార్చుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.


Read more