మామిడికాయ హల్వా

ABN , First Publish Date - 2022-05-07T16:21:46+05:30 IST

మామిడికాయలు- రెండు, సగ్గుబియ్యం - అరకప్పు, పంచదార - రెండు కప్పులు, కొబ్బరిపాలు

మామిడికాయ హల్వా

కావలసినవి: మామిడికాయలు- రెండు, సగ్గుబియ్యం - అరకప్పు, పంచదార - రెండు కప్పులు, కొబ్బరిపాలు - రెండు కప్పులు, నెయ్యి - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, జాజికాయ పొడి - పావు టీస్పూన్‌,  ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా, ఉప్పు - చిటికెడు, జీడిపప్పు - ఐదారు పలుకులు. 


తయారీ విధానం: మామిడికాయల పొట్టు తీసేసి, మిక్సీలో వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేసి పేస్టులా పట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసి వేయించాలి.తరువాత కొబ్బరిపాలు పోయాలి. సగ్గు బియ్యం వేసి ఉడికించాలి. ఇప్పుడు పంచదార వేసి కలుపుకోవాలి. యాలకుల పొడి, జాజికాయ పొడి, ఫుడ్‌ కలర్‌, కాస్త ఉప్పు వేయాలి. మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో కొద్దిగా నెయ్యి వేయాలి.  ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి పెట్టుకోవాలి. మిశ్రమం ఉడికిన తరువాత ప్లేట్‌లోకి పోసుకోవాలి. జీడిపప్పు పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేయాలి.

Read more