రాహుల్ వరంగల్ వచ్చి ఏం మాట్లాడుతారు?: Kavitha

ABN , First Publish Date - 2022-05-04T19:46:26+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్‌లో చేసేది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

రాహుల్ వరంగల్ వచ్చి ఏం మాట్లాడుతారు?: Kavitha

నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్‌లో చేసేది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తెలంగాణ గురించి ఒక్కసారి కూడా పార్లమెంటులో మాట్లాడలేదని.. ఇప్పుడు వరంగల్ వచ్చి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ టూరిస్ట్ స్పాట్ అయిందని.. ఎన్నికలు వస్తున్నాయి కదా...  ఎవరో వస్తారు, ఏదో యాత్ర చేస్తారని అన్నారు. బీజేపీ అబద్దాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఇక్కడ 27 శాఖల్లో 80 వేల ఉద్యోగాలు ఇస్తున్నామని.... కేంద్రంలోని ఖాళీలను భర్తీ చేయించాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధిని పోల్చి చూడాలని.. దేశంలో మధ్యతరగతి ప్రజల ఖర్చు 50 శాతం పెరిగిందని కవిత తెలిపారు. 

Read more