ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Tomato ధరలకు రెక్కలు

ABN, First Publish Date - 2022-05-08T12:53:00+05:30

ఎండలకు పోటీగా టమాటా ధరలు మండుతున్నాయి. మొన్నటి వరకు ధర లేక పండించిన పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారు. ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మెదక్: ఎండలకు  పోటీగా టమాటా ధరలు మండుతున్నాయి. మొన్నటి వరకు ధర లేక పండించిన పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారు. ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. నారాయణఖేడ్‌ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా రూ.40కు విక్రయించారు. నాలుగైదు రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో టమాటా రూ.10కి విక్రయించారు. ఇంతలోనే ధర నాలుగింతలు పెరిగింది. హోల్‌సేల్‌గా 25 కేజీల టమాటా బాక్సు రూ.900 వరకు విక్రయిస్తుండగా, చిల్లరగా కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు దిగుబడి తగ్గిపోవడం, పండిన పంటను తెంపి మార్కెట్‌కు తరలించేందుకు కూలీల సమస్య ఏర్పడటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు లేపోవడమూ ధరలపై ప్రభావం చూపుతున్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా టమాటాను మదనపల్లి నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ అక్కడ కూడా పంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దిగుమతులు తగ్గిపోయాయి. ప్రతీ వంటలో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!