తమిళనాడు సీఎంతో రాష్ట్ర బీసీ కమిషన్ భేటీ
ABN, First Publish Date - 2022-05-14T08:03:30+05:30
తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశమైంది.
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశమైంది. బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్ శుక్రవారం సచివాలయంలో సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు. తమిళనాడులో చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలు తీరుతెన్నుల అధ్యయనానికి బీసీ కమిషన్ అక్కడ పర్యటిస్తోంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించింది.