YS Sharmila: తెలంగాణ ప్రజలకు Kcr పంగనామాలు

ABN , First Publish Date - 2022-05-03T23:52:52+05:30 IST

రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి Cm Kcrకి చేతకావడం లేదా..? ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి పదవి లో ఉండాలి అని ysrtp అధ్యక్షురాలు..

YS Sharmila: తెలంగాణ ప్రజలకు Kcr పంగనామాలు

భద్రాద్రి కొత్తగూడెం: రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి Cm Kcrకి  చేతకావడం లేదా..? ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని ysrtp అధ్యక్షురాలు YS Sharmila ప్రశ్నించారు. మంగళవారం దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిరుద్యోగ నిరాహార దీక్షలో  షర్మిల పాల్గొని మీడియాతో మాట్లాడారు.. ‘‘ ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగం అయితే... నిరుద్యోగానికి కారణం కేసీఆర్. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు.చదువుకున్న పిల్లలు గాలికి తిరగాలి... చేతకాని ముఖ్యమంత్రి బోగాలు అనుభవించాలి. పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి.. చదువుకున్న బిడ్డలు నాశనం అవ్వాలి.పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం మూడు రోజుల పోరాటం చేశాం.25 వారాలుగా నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్నాం.మేము ఉద్యమం చేశాకే ప్రభుత్వానికి  ఉద్యోగాలపై సోయి వచ్చింది. ఎవరికోసం  కేసీఆర్ పరిపాలన చేస్తున్నారు.ఎవరి కోసం ఆలోచన చేస్తున్నారు.


ప్రతి పథకంలోనూ కేసీఆర్‌కి లబ్ధి ఉంటేనే చేస్తారు. లేకుంటే ఏమి చేయరు. కేసీఆర్‌ని రెండు సార్లు గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టారు. ఏరు దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్టుగా ఉంది కేసీఆర్ తీరు.కేసీఆర్ ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు. 8 ఏళ్లుగా ఇచ్చిందే లేదు.. ఇప్పుడు 80 వేలు అంటున్నారు.తెలంగాణ పీఆర్సీ కమిషన్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కేసీఆర్ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడానికి 4 నెలలు టైం పట్టదు.తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందా’’ అని వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు

గుడ్డి గుర్రాలకు పల్లు తోమినట్లుగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌కు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు. ఏ రోజు కేసీఆర్‌ను ప్రశ్నించలేదు. ఇది రాజకీయ వ్యభీచారం అనిపించుకోదా అని షర్మిల ప్రశ్నించారు. 

Read more