ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Saroornagarలో వ్యక్తి దారుణ హత్య.. చంపింది భార్య సోదరులే.. అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-06T00:09:22+05:30

సరూర్‌నగర్ వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సరూర్‎నగర్‎లో బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: సరూర్‌నగర్ వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సరూర్‎నగర్‎లో బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. యువతిని పక్కకు నెట్టివేసి యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు nagaraju అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో పరువు హత్యగా గుర్తించారు. ఇద్దరు నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.


కాగా సరూర్‌నగర్‌కు చెందిన నాగరాజు, సుల్తానా బాల్య స్నేహితులు. కాలం గడిచే కొద్ది వారి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమ మారింది. దీంతో వాళ్లిద్దరూ జనవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. తమ చెల్లెలు సుల్తానా మతాంతర వివాహం చేసుకోవడం సోదరులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌కు ఇష్టం లేదు. చెల్లెని పెళ్లి చేసుకున్న నాగరాజుపై కక్ష పెంచుకున్నారు. అదును కోసం ఎదురు చూశారు. సుల్తానా, నాగరాజు సరూర్‎నగర్‎లో బైక్‌పై వెళ్తుండగా అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే నాగరాజును Mobin Ahmed, Masood ahmed విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. 


విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. దీంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతోనే నాగరాజును మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!