TRS పాలనపై మంత్రి కేటీఆర్కు రేవంత్రెడ్డి కౌంటర్
ABN , First Publish Date - 2022-05-06T18:36:26+05:30 IST
టీఆర్ఎస్ పాలనపై మంత్రి కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనపై మంత్రి కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్. రుణమాఫీ హామీ ఎలా ఎగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి?. మోదీ ముందు మోకరిల్లి రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి?. వరి, మిర్చీ, పత్తి రైతులు ఎలా చస్తున్నారు?.. ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు’’ అంటూ రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.