సెంట్రింగ్‌ పనిచేస్తుండగా కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2022-05-14T05:41:21+05:30 IST

సెంట్రింగ్‌ పనిచేస్తుండగా కార్మికుడు మృతి

సెంట్రింగ్‌ పనిచేస్తుండగా కార్మికుడు మృతి

తాండూరు, మే, 13 : తాండూరు పట్టణంలోని రాజధాని హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్‌ షాపుపై కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పాటు చేసిన బీమ్‌లలో చెక్కలను తొలగిస్తుండగా ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికుడు సైదులప్ప(50) మృతిచెందాడు. కర్ణాటక రాష్ట్రం కడ్తాల్‌ గ్రామానికి చెందిన సైదులప్ప సాయిపూర్‌కు చెందిన మేస్త్రి సీను వద్ద ఈనెల 6న సెంట్రింగ్‌ పనికోసం కుదిరాడు. గురువారం చెక్కను తొలగిస్తుండగా, ప్రమాదవశాత్తు అవి ఒక్కసారిగా కూలిపోయి సైదులప్పపై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు పోలీసులు తెలిపారు.

Read more