ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ప్రమాదవశాత్తు చెరువులోపడి మహిళ మృతి

ABN, First Publish Date - 2022-05-14T05:40:59+05:30

ప్రమాదవశాత్తు చెరువులోపడి మహిళ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మేడ్చల్‌ అర్బన్‌, మే 13 : తోటలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందిన ఘటన శుక్రవారం శామీర్‌పేటలో చోటుచే సుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తా సమీపంలో రామరాజుకు చెందిన జామ తోటను చినుగూరి సత్యనారాయణరాజు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, సత్యనారాయణరాజు వద్ద సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్ల గ్రామానికి చెందిన చింతల సుజాత(22) కుటుంబికులతో పాటు వచ్చి ఆ తోటలోనే పనికి కుదిరి అందులోనే నివాసముంటోంది. గురువారం సాయంత్రం సుజాత బహిర్భూమి కొరకు తోట వెనకల గల శామీర్‌పేట పెద్ద చెరువు సమీపంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె రాత్రివరకూ తిరిగిరాలేదు. కుటుంబికులు, తోట యజమాని చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. వెంటనే వారు శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గజ ఈతగాళ్ళతో వెతికించగా సుజాత మృతదేహాన్ని చెరువు నీటిలోనుంచి బయటకు తీశారు. ప్రమాదవశాత్తు ఆ చెరువులోపడి మృతిచెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!