-
-
Home » Telangana » Rangareddy » Utilize grain purchasing centers-NGTS-Telangana
-
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-05-14T05:46:03+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
- ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ధారూరు/కొడంగల్ రూరల్/కులకచర్ల/బొంరాస్‌పేట్, మే 13: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని వికారాబాద్, కొడంగల్ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఈమేరకు ధారూరు మండల పరిధిలోని గట్టేపల్లి గ్రామంలో హరిదాసుపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు వెన్నంటి ఉంటూ.. వడ్లు కొనుగోలు చేస్తుందని అన్నారు. దళారులను ఆశ్రయించకుండా ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకుని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్ జానకీబాయి, వైస్‌ఎంపీపీ విజయ్, హరిదాసుపల్లి పీఏసీఎస్ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాజునాయక్, ఏఎంసీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ ఎ. అంజయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా రైతులు ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొడంగల్ మండల పరిధిలోని చిట్లపల్లి, అంగడిరైచూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కట్కం శివకుమార్‌గుప్తతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, గోవింద్, ఎంపీటీసీ శివప్ప, కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, నాయకులు దామోదర్‌రెడ్డి, గోడల రాంరెడ్డి, టీటీ.రాములు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు భీములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు వి.బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి తెలిపారు. చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో మాదిరిగానే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్తెమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, టీఆర్‌ఎస్ పార్టీ కులకచర్ల, చౌడాపూర్ మండలాల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ పీరంపల్లి రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాంలాల్‌నాయక్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాజప్ప, మొగులయ్య, జుబేర్, తదితరులున్నారు. అదేవిధంగా బొంరాస్‌పేట్ మండలంలోని గౌరారం, ఏర్పుమళ్ల, చిలుముల్‌మైలారంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

