మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి పురస్కారాలు

ABN , First Publish Date - 2022-05-14T06:04:22+05:30 IST

మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి పురస్కారాలు

మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి పురస్కారాలు
శంషాబాద్‌: అవార్డు అందుకుంటున్న సుష్మారెడ్డి

 షాద్‌నగర్‌/శంషాబాద్‌, మే, 13: షాద్‌నగర్‌, శంషాబాద్‌ మున్సిపాలిటీలకు 2022 సంవత్సరానికి గానూ పట్టణ ప్రగతి పురస్కారాలు లభించాయి.  శుక్రవారం హైదరాబాద్‌లోని టెస్కో ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌లు ఆయా మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులకు అవార్డులను ప్రదానం చేశారు. షాద్‌నగర్‌లో ఆదాయం, సేవా బట్వాడాలో ఉత్తమ ఫలితాలు సాధించినందు గానూ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌  ఈ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా శంషాబాద్‌ మున్సిపాలిటీలో హరితహారం సంపూర్ణంగా పూర్తి చేసిందుకు గానూ 50వేల జనాభా కేటగిరీలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. 

Read more