-
-
Home » Telangana » Rangareddy » Unused housing department building-NGTS-Telangana
-
నిరుపయోగంగా గృహ నిర్మాణ శాఖ భవనం
ABN , First Publish Date - 2022-05-13T06:11:57+05:30 IST
నిరుపయోగంగా గృహ నిర్మాణ శాఖ భవనం
ఆమనగల్లు ,మే 12: ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన గృహ నిర్మాణ శాఖ కార్యాలయ భవనం నిరుపయోగంగా మారింది.ఏళ్ల కాలంగా భవనం వినియోగం లో లేక , నిర్వాహణ కొరవడి కళాహీనంగా తయారైంది. భవనం చుట్టూ చెట్లు మొలిచి క్రమంగా శిథిల స్థితికి చేరుకుంటుంది. దశాబ్దం క్రితం గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో అతి తక్కువ ఖర్చుతో భవనం నిర్మించారు. కాగా టీఆర్ఎ్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణ సంస్థను ఎత్తివేసింది. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. స్వల్ప మరమ్మతులు చేస్తే భవనం ఏదేని ఇతర కార్యాలయానికి, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించవచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోని నిరుపయోగంగా ఉన్న భవనాన్ని వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.