‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-14T06:08:34+05:30 IST

‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

చేవెళ్ల, మే 13: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చేవెళ్ల మండల ఇన్‌చార్జి ఎంఈవో ఆక్బర్‌ అన్నారు. చేవెళ్ల మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం పదవతరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ నుంచి నిర్వహించే పదవ తరగతి పరీక్షలను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలన్నారు. చేవెళ్ల మండలంలో 6 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు.  560 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను పాఠశాల నుంచి లేదా ఇంటర్‌నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఒకేరోజు రెండు పేపర్ల పరీక్షలు ఉంటుందన్నారు. పరీక్షఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45గంటల వరకు ఉంటుందన్నారు. ఈ సమా వేశంలో అధికారులు పాల్గొన్నారు.

Read more