అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-05-14T06:09:31+05:30
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తూర్, మే, 13: కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడ శివారులో 27 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది పడిఉన్నాడని కొత్తూర్ ఎస్‌ఐ శంకర్ తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కొత్తూర్ పోలీ్‌సస్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.