-
-
Home » Telangana » Rangareddy » Taskforce raids on fertilizer stores-NGTS-Telangana
-
ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
ABN , First Publish Date - 2022-05-14T06:09:53+05:30 IST
ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
ఆమనగల్లు, మే 13: ఆమనగల్లు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ల దుకాణాల్లో శుక్రవారం వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి, విత్తనాల స్టాక్ రిజిస్ట్రర్ తదితర వివరాలను సేకరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారి, కమిషనరేట్ ఏడీఏ పద్మజ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓ దుకాణంలో రూ 1.94.400విలువ గల 240 పత్తి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెవెంట రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీఐ ఏ.రాములు, సీడ్ ఇన్‌స్పెక్టర్ మహేశ్‌బాబు, ఎస్‌ఐ ధర్మేశ్ తదితరులు పాల్గొన్నారు.

