-
-
Home » Telangana » Rangareddy » People know someone who has been deceived into believing-NGTS-Telangana
-
నమ్మించి మోసంచేసింది ఎవరో ప్రజలకు తెలుసు
ABN , First Publish Date - 2022-05-14T06:08:59+05:30 IST
నమ్మించి మోసంచేసింది ఎవరో ప్రజలకు తెలుసు
కందుకూరు, మే 13: నమ్మించి మోసం చేసింది ఎవరో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ స్వార్థకోసం చేపట్టిన పాదయాత్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మద్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అభివృద్ధికి పాటు పడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో కలిసి రావాలని బీజేపీ నేతలను కోరారు.

