ఇంజనీర్లకు ఆన్‌లైన్‌ పరీక్షలు : డీఆర్వో

ABN , First Publish Date - 2022-05-14T05:42:42+05:30 IST

ఇంజనీర్లకు ఆన్‌లైన్‌ పరీక్షలు : డీఆర్వో

ఇంజనీర్లకు ఆన్‌లైన్‌ పరీక్షలు : డీఆర్వో

  • మేడ్చల్‌ జిల్లాలో 5 కేంద్రాల ఏర్పాటు

మేడ్చల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వివిధ డిపార్ట్‌మెంట్లలో ఇంజనీర్ల ఎంపిక కోసం ఎపీపీఎస్సీ ఆధ్వర్యంలో నేడు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో లింగ్యానాయక్‌ తెలిపారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌ పరీక్షలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లాలో అల్వాల్‌, మల్కాజ్‌గిరిలో రెండు, మల్లాపూర్‌, నాచారంలోని కేంద్రాల్లో ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 5,000 మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, నేడు, రేపు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు. 

Read more