-
-
Home » Telangana » Rangareddy » MLA extensive tour of the zones-NGTS-Telangana
-
మండలాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
ABN , First Publish Date - 2022-05-14T06:05:19+05:30 IST
మండలాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
ఆమనగల్లు, మే 13: ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు, వివాహ వేడుకల్లో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, అనురాధపత్యానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్గుప్త, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరి లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు ఓరుగంటి వెంకట్‌రెడ్డి, గంప శ్రీను, లచ్చిరాంనాయక్, జోగు వీరయ్య, లక్పతినాయక్ ఉన్నారు.

