లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-11-07T23:42:19+05:30 IST
మద్యం కేసుల్లో పట్టుబడిన వారు లోక్‌అదాలత్ సేవలను వినియోగించుకోవాలని రిటైర్డ్ న్యాయమూర్తి నర్సింహచారి, చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వాసు తెలిపారు.
చేవెళ్ల, నవంబరు 7: మద్యం కేసుల్లో పట్టుబడిన వారు లోక్‌అదాలత్ సేవలను వినియోగించుకోవాలని రిటైర్డ్ న్యాయమూర్తి నర్సింహచారి, చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వాసు తెలిపారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో సోమవారం మోగాలోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగా లోక్ అదాలత్ ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. సోమవారం ఒక్క రోజే మద్యం సేవించి వాహనాలు నడిపిన 208 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, గురువయ్యగౌడ్, మహేశ్‌గౌడ్, ట్రాఫిక్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఏఎ్‌సఐ చందర్‌నాయక్ పాల్గొన్నారు.
Read more

