-
-
Home » Telangana » Rangareddy » Keshampet police lodge complaint with DCP against BJP leader-NGTS-Telangana
-
కేశంపేట పోలీసులు, బీజేపీ నేతపై డీసీపీకి ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-05-14T06:10:36+05:30 IST
కేశంపేట పోలీసులు, బీజేపీ నేతపై డీసీపీకి ఫిర్యాదు
శంషాబాద్, మే 13: బీజేపీ కేశంపేట మండల అధ్యక్షుడు పి.నర్సింహ తనపై తప్పుడు ఫిర్యాదు చేశాడని కేశంపేట మండలానికి శ్రీను శుక్రవారం శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఫ్లెక్సీలు చించాననే నెపంతో పోలీసులు తనను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టి హింసించారని వాపోయాడు. రాజకీయ కక్షతో తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడితో పాటు తనను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని శ్రీను డీసీపీని కోరాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనను పోలీసులు కులం పేరుతో దూషించి దుర్భాషలాడారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

