హామీలను వెంటనే అమలు చేయాలి
ABN, First Publish Date - 2022-05-14T06:07:44+05:30
హామీలను వెంటనే అమలు చేయాలి
చేవెళ్ల, మే 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభులింగం అన్నారు. మండలంలోని జాలగూడలో శుక్రవారం సీపీఐ గ్రామ సభలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్ని సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల జీవితాల్లో మార్పు రావడంలేదని వాపోయారు. వంటగ్యాస్, ఇంధన ధరలు పెంచి ప్రజలపై భారం మోపడం ఎంత వరకు న్యాయమన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల ప్రదాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్, నాయకులు అంజయ్య, మల్లేశ్, అంజయ్య, కృష్ణ, సాయిలు, లక్ష్మి, మల్లేశ్, అంతయ్య, జంగయ్య, నవీన్‌కుమార్, పద్మనాభం, పొట్ట యాదమ్మ, నాగమ్మ తదితరులు ఉన్నారు.