సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

ABN , First Publish Date - 2022-05-14T05:43:11+05:30 IST

సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

ఘట్‌కేసర్‌, మే 13 : వానాకాలం సాగుకు ముందు రైతులు పొలాల్లో పచ్చిరొట్ట పైర్లు సాగుచేయాలని, సబ్సిడీపై రైతులకు అందుబాటులో విత్తనాలు లభిస్తాయని మండల వ్యవసాయ అధికారి ఎంఏ భాసిత్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఘట్‌కేసర్‌ సహకార సంఘంలో 65శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 30కిలోల జీలుగ విత్తనాలు సబ్సిడీ పోను రూ.665, జనుము విత్తనాలు 40కిలోలకు గాను రూ.1166 విక్రయిస్తున్నట్లు అయన తెలిపారు.

Read more