ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ABN, First Publish Date - 2022-05-14T05:43:53+05:30
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
బొంరాస్‌పేట్, మే 13: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు.. కొందరి రైతుల పేర్లను లిస్టులో చేర్చలేదని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. ఆయనతో రైతులు వెంకటయ్య, మల్లమ్మ, పుల్లమ్మ తదితరులున్నారు.