ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-14T05:46:59+05:30 IST

ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 13 : ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, గ్రామస్తులు వ్యాక్సిన్‌ సెకండ్‌, బూస్టర్‌డోస్‌ వేసుకునే విధంగా అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు చర్యలు తీసుకోవాలని అవుశాపూర్‌ సర్పంచ్‌ ఏనుగు కావేరీ మశ్చేందర్‌రెడ్డి తెలిపారు. అవుశాపూర్‌ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏఎన్‌ఎం, అంగన్‌వాడీల టీచర్లతో సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్‌. ఉమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read more