‘దళితబంధు’ చెక్కు అందజేత
ABN, First Publish Date - 2022-05-14T06:06:11+05:30
‘దళితబంధు’ చెక్కు అందజేత
లబ్ధిదారుకు చెక్కు అందజేస్తున్న జడ్పీటీసీ తన్వీరాజు
శంషాబాద్, మే 13: మండలపరిషత్ కార్యాలయంలో జిల్లాపరిషత్ ఫ్లోర్‌లీడర్, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు దళితబంధు లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని పాల్మాకుల గ్రామానికి చెందిన రామస్వామి, శ్రీనివా్‌సలకు దళితబంధు రెండో విడతగా రూ.45,000 చొప్పున మంజూరయ్యాయి. ఈ మేరకు విడుదలైన రెండు చెక్కులను జడ్పీటీసీ నీరటి తన్వీరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ ఎంపీడీవో వసంతలక్ష్మి పాల్గొన్నారు.