బండి పాదయాత్ర మరుసటి రోజే బీజేపీకి షాక్‌..!

ABN , First Publish Date - 2022-05-14T05:55:27+05:30 IST

బండి పాదయాత్ర మరుసటి రోజే బీజేపీకి షాక్‌..!

బండి పాదయాత్ర మరుసటి రోజే బీజేపీకి షాక్‌..!
మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరిన అనితాశ్రీనివాస్‌

  • కారెక్కిన పులిమామిడి సర్పంచ్‌ అనితా శ్రీనివాస్‌


కందుకూరు మే 13: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్నారు. ఈపాదయాత్రలో ఆయనకు నీరాజనాలు పలికిన పులిమామిడి సర్పంచ్‌ అనితా శ్రీనివాస్‌ ఉన్నట్టుండి మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాత్రి బీజేపీలో ఉన్న ఆమె తెల్లవారగానే టీఆర్‌ఎ్‌సలో చేరడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నిన్నగాక మొన్న మీర్‌పేట్‌ కార్పోరేటర్లు నందు, మమత ప్రవీణ్‌, టీఆర్‌ఎ్‌సలోకి చేరి బీజేపీకి షాక్‌ ఇచ్చారు. ఇది మరువక ముందే పులిమామిడి సర్పంచ్‌ పార్టీ మారడంపై బీజేపీలో గందరగోళం ఏర్పడింది. 

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే వారికి సముచిత స్థానం: మంత్రి 

టీఆర్‌ఎ్‌సలో చేరేవారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. పులిమామిడి సర్పంచ్‌తో పాటు 150మంది కార్యకర్తలు నగరంలోని మంత్రి నివాసానికి శుక్రవారం ఉదయం చేరుకొని అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ సర్కార్‌పై విషం చిమ్మడానికి వస్తున్న అమిషాను ఇక్కడి ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నా కొన్ని పార్టీల నేతలు రాజకీయ లబ్ధి కోసం విమర్శించడం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జయేందర్‌ముదిరాజ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, నాయకులు ఎస్‌.సురేందర్‌రెడ్డి, జి.లక్ష్మీనర్సింహారెడ్డి, అనేగౌని దామోదర్‌గౌడ్‌, అనేగౌని పాండుగౌడ్‌, కె.విఘ్నేశ్వర్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి, చైతన్యరాజు, చింతకింది లక్ష్మమ్మ, జాల పాండు, శ్రీకాంత్‌, టి.శేఖర్‌, సురేష్‌, యేశయ్య పాల్గొన్నారు. 

Read more