ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పిడుగుపాటుకు ఎద్దు, 2 ఆవుల మృత్యువాత

ABN, First Publish Date - 2022-05-14T05:39:59+05:30

పిడుగుపాటుకు ఎద్దు, 2 ఆవుల మృత్యువాత

పిడుగుపాటుకు మృతిచెందిన ఎద్దు, ఆవులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బషీరాబాద్‌, మే 13 : పిడుగుపాటుకు ఒక ఎద్దు, రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌ తండాకు సమీపంలోని వ్యవసాయ పొలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం... కాశీంపూర్‌ తండాకు చెందిన గిరిజన రైతు మిట్టునాయక్‌ రోజూ మాదిరిగానే రెండు ఎద్దులు, రెండు ఆవులను మేత కోసం పొలం వద్ద చెట్టుకు కట్టేశాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పిడుగుపడగా ఒక ఎద్దు, రెండు ఆవులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. మరో ఎద్దు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. అప్పటికే రైతు ఇంటి నుంచి పొలం వద్దకు చేరుకోగా ఆ మూగజీవాలు మృత్యువాత పడటంతో కన్నీటి పర్యాంతమయ్యాడు. వ్యవసాయం చేసుకుని బతికే పేదింటి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్‌ నీలిబాయి, బషీరాబాద్‌ మండల ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ బి.ఆర్‌.శ్రీనివాస్‌ కోరారు. కాగా, చనిపోయిన ఎద్దు, రెండు ఆవుల ధర దాదాపు రూ.లక్షా40వేలు ఉంటుందని బాధిత రైతు ఆవేదనతో చెప్పాడు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!