బీజేపీ ఫ్లెక్సీ చించిన వ్యక్తులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-05-14T06:10:15+05:30 IST

బీజేపీ ఫ్లెక్సీ చించిన వ్యక్తులపై కేసు నమోదు

బీజేపీ ఫ్లెక్సీ చించిన వ్యక్తులపై కేసు నమోదు

కేశంపేట, మే, 13: మండల పరిధిలోని కొత్తపేటలో ఈనెల 10న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రమ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించిన ఇద్దరు వ్యక్తులపై  కేశంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌  తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 12గంటలకు కొత్తపేట గ్రామానికి చెందిన నిర్థవెల్లి శ్రీను, రొయ్యల రాజులు బీజేపీ ఫ్లెక్సీలను చించేస్తుండగా బీజేపీ నాయకులు విఠల్‌ గౌడ్‌, మరి కొందరు వారిని గుర్తించారు. అదేవిధంగా తొమ్మిదిరేకుల, కాకునూర్‌, కేశంపేట గ్రామాల్లో బీజేపీ ఫ్లెక్సీలను చించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈఘటనపై ఈనెల 11న బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్‌, విఠల్‌ గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more