ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆటో-బొలెరో ఢీ.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-05-14T05:40:38+05:30

ఆటో-బొలెరో ఢీ.. ఒకరి మృతి

రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కూరగాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పూడూర్‌, మే 13: రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పూడూర్‌ మండల పరిధిలోని కండ్లపల్లి గేటు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. చెన్‌గోముల్‌ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల మేరకు... హైదరాబాద్‌ నుంచి కూరగాయల లోడ్‌తో మన్నెగూడకు వస్తున్న ఆటోను మన్నెగూడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో వస్తున్న పరిగి మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఎండీ. అఫ్రోజ్‌ (25)కు తీవ్ర గాయాలు కాగా, అతడి స్నేహితుడు కొందుర్గు మండలానికి చెందిన నర్సిములుకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎండీ.అఫ్రోజ్‌ మృతి చెందాడు. ఈ సంఘటనలో నర్సిములకు తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి ఎండీ. షర్ఫోద్దీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!