ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిజామాబాద్‌ ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థిని మృతి

ABN, First Publish Date - 2022-05-14T09:23:14+05:30

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి లో గైనకాలజీ విద్యార్థిని, డాక్టర్‌ శ్వేత మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • విశ్రాంతి గదిలో విగతజీవిగా కనపడిన శ్వేత
  • హార్ట్‌ స్ర్టోక్‌గా భావిస్తున్న ఆస్పత్రి వైద్యులు

నిజామాబాద్‌/పెద్దబజార్‌ మే 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి లో గైనకాలజీ విద్యార్థిని, డాక్టర్‌ శ్వేత మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు వార్డులో విధుల్లో ఉన్న ఆమె.. అనంతరం విశ్రాంతి గదిలో నిద్రలోనే చనిపోవడం ఆస్పత్రిలో కలకలం రేపింది. తోటి విద్యార్థిని విధులు ముగించుకుని శ్వేతను లేపేందుకు యత్నించారు. శ్వేత అప్పటికే చనిపోయిందని గుర్తించి సీనియర్‌ వైద్యులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం శ్వేత తల్లిదండ్రులకు ఆస్పత్రి సిబ్బంది సమాచా రం అందించారు. పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మం డలం ఎల్‌ఎండీకి చెందిన డాక్టర్‌ శ్వేత నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ పీజీ కళాశాలలో గైనకాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా రు. ఈ కళాశాలలో చేరకముందు కరీంనగర్‌లో ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేశా రు. శ్వేత తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌ హౌసిం గ్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్నారు. శ్వేతకు పీజీ సీటు రావడంతో రెండేళ్ల క్రితం ఆమెను నిజామాబాద్‌కు పంపించారు. కొవిడ్‌ సమయంలో కూడా ఆస్పత్రిలో శ్వేత చురుకుగా విధులు నిర్వహించారు. రెండుసార్లు కొవిడ్‌వచ్చినా తగ్గగానే ఆస్పత్రి వార్డుల్లో విధులు నిర్వహించారు. కాగా, అర్ధరాత్రి వరకు చురుగ్గా ఉండి విధులు నిర్వర్తించిన డాక్టర్‌ శ్వేత అకస్మాత్తుగా మృతి చెందడంతో అనుమానాలు నెలకొ న్నాయి. విద్యార్థిని మృతి తర్వాత శుక్రవా రం ఉదయం 10గంటల వరకు ఆస్పత్రిలోని ప్రసూతి వార్డుకు మీడియా సహా ఎవరినీ అనుమతించలేదు. గురువారం అర్ధరాత్రి శ్వేత తమతో మాట్లాడిందని ఆమె తల్లి దండ్రులు చెప్పారు. అస లు ఆస్పత్రిలో ఏం జరిగిందో వైద్యులు చెప్పడంలేదని, పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. శ్వేతకు రెండుసార్లు కొవిడ్‌ వచ్చిందని దాని సంబంధిత హార్ట్‌ స్ర్టోక్‌గా అనుమానిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ అన్నారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!