ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఒక్క శాతం చాలు... 2 శాతం వద్దు

ABN, First Publish Date - 2022-05-14T08:58:18+05:30

ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా నగదురహిత వైద్యం కోసం ఉద్యోగుల మూలవేతనంలో 1శాతం చందాగా వసూలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరంలేదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • ఈహెచ్‌ఎస్‌ చందాపై మంత్రి హరీశ్‌ రావుకు ట్రెసా విజ్ఞప్తి
  • హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా నగదురహిత వైద్యం కోసం ఉద్యోగుల మూలవేతనంలో 1శాతం చందాగా వసూలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరంలేదని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) పేర్కొంది. ఈ మేరకు మంత్రి టి.హరీశ్‌రావును ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వి.రవీందర్‌రెడ్డి, గౌతమ్‌ కుమార్‌ కలిసి వినతిపత్రం ఇచ్చారు. మూలవేతనం నుంచి 2శాతం చందాగా వసూలు చేస్తే ఉద్యోగులు నష్టపోతారని పేర్కొన్నారు. దీనిపై మంత్రి హరీశ్‌ స్పందిస్తూ అన్ని సంఘాలతో చర్చించి, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.  


ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1% చందా: టీజీఓ

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి గెజటెడ్‌ అధికారుల మూలవేతనం నుంచి 1శాతం చందా జమ చేస్తామని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీఓ) ప్రకటించింది. సంఘం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం జరిగింది. పీఆర్సీ ప్రకటించిన విధంగానే ఒక్క శాతం చందా ఇవ్వాలని తీర్మానించినట్టు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్‌ కుమార్‌గౌడ్‌ తెలిపారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!