ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నారసింహుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం

ABN, First Publish Date - 2022-05-14T06:45:37+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం నారసింహుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారిని తిరువేంకటనాథుడిగా దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ధ్వజస్తంభం ఎదుట ప్రత్యేకవేదికపై తీర్చిదిద్దారు.

ఆలయ తిరువీధుల్లో అలంకార సేవోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఉదయం తిరువేంకటనాథుడిగా.. రాత్రివేళ గరుఢవాహనంపై దర్శనం

స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట, మే 13: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం నారసింహుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారిని తిరువేంకటనాథుడిగా దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ధ్వజస్తంభం ఎదుట ప్రత్యేకవేదికపై తీర్చిదిద్దారు. దేవతల సేనానాయకుడు విశ్వక్సేనుడిని కొలుస్తూ అర్చకబృందం, రుత్వికులు పుణ్యాహవాచనం నిర్వహించారు. పుణ్యాహవాచన మంత్రజలంతో ఆలయం, ఆలయ పరిసరాలను వేద మంత్రపఠనాల నడుమ శుద్ధి చేశారు. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులు, ఉత్సవమూర్తులకు రక్షసూత్రధారణ చేసిన అర్చకులు.. నిర్వాహకులకు కంకణధారణ చేశారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకవేదికపై అధిష్ఠింపజేసిన పూజారులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం తిరువేంకటపతి నాథుడి అలంకారసేవను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధానాలయం నుంచి ఊరేగింపుగా ఆలయ తిరువీధుల్లోకి తీసుకొచ్చిన ఆచార్యులు ప్రధానాలయం చుట్టూ అలంకార సేవను ఊరేగించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నృసింహ జయంత్యుత్సవాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ఈ వైదికపర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు అర్చకబృందం, రుత్వికులు నిర్వహించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తిరువేంకటపతినాథుడి అలంకార సేవ

యాదాద్రీశుడి జయంత్యుత్సవాల్లో భాగంగా తిరువేంకటపతినాథుడి అలంకారసేవలో లక్ష్మీనృసింహుడిని అలంకరించి సేవోత్సవం నిర్వహించారు. యావత్‌ భక్తజనకోటిని అనుగ్రహించేందుకు తిరువేంకటనాథుడిగా అలంకరించిన ఆచార్యులు ఆలయ తిరువీధుల్లో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. ముందుగా ప్రధానాలయంలో అలంకారసేవకు ప్రత్యేకపూజలు చేశారు.  


లక్ష కుంకుమార్చన

మహోత్సవాల్లో భాగంగా ప్రధానాలయంలో ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దిన ఆచార్యులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షకుంకుమార్చన పూజలు నిర్వహించారు. అదే విధంగా స్వామివారి జయంత్యుత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం ప్రధానాలయంలో మృత్స్యంగ్రహణం.. అంకురార్పణపర్వాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గరుఢ వాహనంపై ఊరేగించారు.  


సంప్రదాయపద్ధతిలో సువర్ణ పుష్పార్చనలు 

యాదగిరివాసుడి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చన లు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవాపర్వాలు నేత్రపర్వంగా సాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన ఆచార్యులు గర్భగుడిలో ని ప్రతిష్ఠా అలంకారమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. అనంతరం స్వయంభువులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలు, కుంకుమలతో అర్చించారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలోనూ స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం సంప్రదాయరీతిలో నిర్వహించారు. వివిఽధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.14,16,941 ఆదాయం సమకూరింది.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!