నృసింహుని దేవాలయానికి పూర్వ వైభవం తెస్తాం
ABN , First Publish Date - 2022-05-14T06:34:38+05:30 IST
అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తెస్తామని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.
అర్వపల్లి, మే 13: అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తెస్తామని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం దేవాలయంలోని ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనోత్సవ పను లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా రాజగోపురంతో పాటు ముఖ ద్వారాలను త్వరలో నిర్మిస్తామన్నారు. దేవాలయ గర్భగుడి పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వ హించే ధ్వజ స్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలను వైభవంగా నిర్వ హిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచ్ బైరబోయిన సునితరామలింగయ్య, ప్రభాకర్, నరేష్,పాల్గొన్నారు.
‘దళిత బంధు’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి: దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. దళిత బంధు కింద మంజూరైన దుస్తుల దుకాణం, టెంట్ హౌస్ దుకాణం, వాహనాన్ని శుక్రవారం తుంగ తుర్తిలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ దళితుడికీ ఈ పథకం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీంసింగ్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, ఎంపీటీసీ సుజనపరమేష్ తదితరులు పాల్గొన్నారు.

