తండ్రీకుమారుల హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు

ABN , First Publish Date - 2022-05-14T06:21:11+05:30 IST

బోరు పంచాయితీలో తండ్రీకుమారులను హత్య చేసిన ఇద్దరికి జీవితఖైదు విధిస్తూ జిల్లా రెండో అదనపు జడ్జి వసంత్‌ పాటిల్‌ శుక్రవారం తీర్పు చెప్పారు.

తండ్రీకుమారుల హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు

 ప్రాణాలు తీసిన బోరు పంచాయితీ

సూర్యాపేట లీగల్‌, మే 13: బోరు పంచాయితీలో తండ్రీకుమారులను హత్య చేసిన ఇద్దరికి జీవితఖైదు విధిస్తూ జిల్లా రెండో అదనపు జడ్జి వసంత్‌ పాటిల్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్వపల్లి మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన తండ్రీకుమారులు గైగుల శ్రీనివాస్‌, వినయ్‌లు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. గైగుల శ్రీనివాస్‌ పొలం పక్కనే ఉన్న తన పాలివాళ్లు గైగుల వెంకన్న, అవిలయ్యలతో బోరు పంచాయితీ ఉంది. ఈక్రమంలో 2016 మార్చి 10వ తేదీ రాత్రి గైగుల శ్రీనివాస్‌, వినయ్‌లు పొలం వద్ద నిద్రిస్తుండగా వెంకన్న, అవిలయ్య కలిసి హత్య చేశారు. ఈ ఘటనపై గైగుల శ్రీనివాస్‌ భార్య రాధ అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. అప్పటి ఏఎ్‌సఐ వీరమల్లయ్య కేసు నమోదుచేయగా అప్పటి ఎస్‌ఐ ఏ.మోహన్‌రెడ్డి పరిశోధనాధికారిగా ఆనాటి సీఐ డి.లక్ష్మణ్‌ నిందితులపై అభియోగపత్రం దాఖలు చేశారు. 18 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 


Read more