రోడ్డు పనులతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జాం

ABN , First Publish Date - 2022-05-15T05:17:52+05:30 IST

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

రోడ్డు పనులతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జాం
రోడ్డు పనులతో నిలిచిన ట్రాఫిక్‌

చిట్యాలరూరల్‌, మే 14: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేపట్టడంతో వాహనాలు ఒకే వైపు నుంచి వెళ్తుండటంతో నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు-పెద్దకాపర్తి వద్ద ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. జీఎంఆర్‌ సిబ్బంది రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు పనులు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఒకవైపు పూర్తిగా రోడ్డు వేస్తున్నారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే రోడ్డు మీదుగా వన్‌వే ద్వారా వాహనాల రాకపోకలను మళ్లించారు. ఒకే దారిలో వాహనాలు ఇరువైపులా రాకపోకలు జరుగుతుండటంలో రహదారిపై ట్రాఫిక్‌జాం అయింది. ఈ పనులు నాలుగు రోజులుగా ఉదయం సమయంలో కొనసాగుతుండగా రోజూ ఈ పరిస్థితి తలెత్తుతోంది. రోడ్డు పనులు జరుగుతున్నంత వరకు వాహనాలు వన్‌వేలో వెళ్తున్నందున ట్రాఫిక్‌జాం అవుతోంది. చిట్యాల పోలీసులు, జీఎంఆర్‌ సిబ్బంది వన్‌వే మార్గంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. రహదారిపై గుంతలు ఉన్న ప్రాంతంలో మరమ్మతులు జరుగుతున్నాయని సుమారు మరో 15రోజుల వరకు రహదారిపై మరమ్మతు పనులు జరుగుతాయని జీఎంఆర్‌ ప్రతినిధి తెలిపారు.

Read more