బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-14T06:40:46+05:30 IST

బైక్‌ అదుపు తప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందాడు.

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

సంస్థాన నారాయణపురం, మే 13: బైక్‌ అదుపు తప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సంస్థాననారాయణపురంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగేందర్‌గౌడ్‌ తెలిపిన చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామానికి చెందిన వెలిజాల శ్రవణ్‌కుమార్‌(34) హెయిర్‌ కటింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల కిందట చండూరు మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన హేమలతతో వివాహమైంది. హేమలత పుట్టింటి వద్దే ఉంది. గురువారం వారి వివాహవార్షికోత్సవం ఉండటంతో శ్రవణ్‌కుమార్‌ అత్తగారింటికి వెళ్లాడు. శుక్రవారం పంతంగికి వచ్చే క్రమంలో దేవిరెడ్డిబంగ్లా మీదుగా సర్వేల్‌ వెళ్తుండగా మూలమలుపు వద్ద బైక్‌ అదపు తప్పి పడిపోయాడు. దీంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


Read more