అంజయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

ABN , First Publish Date - 2022-05-14T06:43:38+05:30 IST

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రొడ్డ అంజయ్య ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని, ఒక ప్రజా ఉద్యమ కారుడిని కోల్పోయామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

అంజయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
అంజయ్య అంతిమయాత్రలో పాల్గొన్న సీపీఎం నేతలు వీరభద్రం, సీతారాములు, జహంగీర్‌

పండుగ



 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

చౌటుప్పల్‌ టౌన, మే 13: సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రొడ్డ అంజయ్య ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని, ఒక ప్రజా ఉద్యమ కారుడిని కోల్పోయామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో అంజయ్య మృతదేహంపై వారు పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని పేద వర్గాల సమస్యల పరిష్కారానికి అంజయ్య అలుపెరగని పోరాటాలను సాగించారని అన్నారు. అంజయ్య సాగించిన ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అంజయ్య తుదిశ్వాస వరకు ప్రజా ఉద్యమాలతోనే మమేకం అయ్యారని వారు అన్నారు. ఆయన ఆశయ సాధనకు సీపీఎం కృషి చేస్తుందని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉం టుందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే అంజ య్యకు నిజమైన నివాళి అని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. అంజయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని వారు అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, పీఏసీఎస్‌ చైర్మన చింతల దామోదర్‌ రెడ్డి,  డైరెక్టర్‌ బోరెం నర్సిరెడ్డి,  మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు దండ హిమబిందు అరుణ్‌కుమార్‌, జి.లక్ష్మణ్‌గౌడ్‌, పార్టీ  జిల్లా కమిటీ సభ్యుడు ఎండి.పాషా, బూరుగు కృష్ణారెడ్డి,  పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహ పాల్గొన్నారు.

Read more