మండల అభివృద్ధికి అధికారులు సహకరించాలి
ABN, First Publish Date - 2022-05-14T06:12:43+05:30
మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంపీపీ పోక ల శ్రీవిద్య అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ శ్రీవిద్య
మాడ్గులపల్లి, మే 13: మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంపీపీ పోక ల శ్రీవిద్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీ వో కార్యాలయంలో ని ర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకా లు అమలు చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులందరూ మండల అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన సభ్యుడు మోసినఅలీ, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.