ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిర్వాసితుల్లో ‘సర్వే’ గుబులు

ABN, First Publish Date - 2022-05-14T06:53:18+05:30

పట్టణంలోని ఎన్నెస్పీ కాల్వకట్టపై నివసిస్తు న్న బాధిత కుటుంబాలను గుర్తించేందుకు శుక్రవారం రెవెన్యూ అధికారు లు నాలుగో విడత సర్వేచేశారు. గతంలో మూడుసార్లు రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్నెస్పీ శాఖల అధికారులు సర్వేలు చేశారు. ఇప్పుడు వాటన్నంటినీ పక్కనబెట్టి నాలుగో విడత సర్వేచేశారు.

పట్టణంలో సర్వే చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నాలుగో విడత సర్వే చేపట్టిన అధికారులు 

న్యాయం కోసం ఔటర్‌ రింగ్‌రోడ్డు బాధితుల నిరీక్షణ 



హుజూర్‌నగర్‌ , మే 13: పట్టణంలోని ఎన్నెస్పీ కాల్వకట్టపై నివసిస్తు న్న బాధిత కుటుంబాలను గుర్తించేందుకు శుక్రవారం రెవెన్యూ అధికారు లు నాలుగో విడత సర్వేచేశారు. గతంలో మూడుసార్లు రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్నెస్పీ శాఖల అధికారులు సర్వేలు చేశారు. ఇప్పుడు వాటన్నంటినీ పక్కనబెట్టి నాలుగో విడత సర్వేచేశారు. నాలుగు బృందాలుగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రంవరకు అధికారులు సర్వేచేశారు. దీంతో బాధితుల గుండెల్లో గుబులు మొదలైంది. 2013లో పట్టణంలోని ఔటర్‌రింగ్‌రోడ్డు పనులు రూ.22కోట్లతో చేపట్టారు. 2014 వర కు ముక్త్యాల బ్రాంచి కెనాల్‌ మీదుగా లింగగిరి మేజర్‌వరకు పనులు చేశారు. కాగా పట్టణ పరిధిలోని మల్లన్ననగర్‌, సీతారాంనగర్‌, చింతలబజార్‌, ఎన్నెస్పీక్యాంపు, శ్రీనగర్‌కాలనీ వరకు లింగగిరి మేజర్‌పై ఇండ్లు ఉండటంతో సుమారు 2 కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి. కాగా గ త ప్రభుత్వ హయంలో 80శాతం రింగ్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేశా రు. ఇంకా మిగిలిన పనులకు ఇటీవల ప్రభుత్వం 2కిలోమీటర్లకు రూ.6 కోట్లు మంజూరుచేసింది. కాగా గతంలో కొంతమందికి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫణిగిరి గట్టు వద్ద ఇళ్ల స్థలాలు పం పిణీ చేసింది. మిగిలిన కొంతమందికి ఇవ్వకపోవడంతో ఎన్నెస్పీ కాల్వకట్టపై నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రెండునెలల క్రితం మునిసిపల్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఎన్నెస్పీల ఉమ్మడి ఆధ్వర్యంలో సర్వేచేశారు. అయినా ఇప్పుడు మళ్లీ సర్వే చేపట్టడంపై బాధితుల్లో ఆందోళన నెలకొం ది. గతంలో బాధితులకు ఇచ్చిన విధంగా తమకు కూడా స్థలాలు కేటాయించి ఇళ్లుకట్టుకునేందుకు రూ.3లక్షలు కేటాయించాలని కోరుతున్నారు. కాగా సర్వేచేసిన సందర్భంగా అధికారులు మాత్రం బాధితులను మాత్ర మే గుర్తిస్తున్నామని, మిగిలిన విషయాలు తమకు తెలియదని పేర్కొనడంతో బాధితులు ఏం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


బాధితులకు న్యాయం చేయాలి : గుండు వెంకటేశ్వర్లు 

కాల్వకట్టపై నివసించే పేదలందరికీ ఇండ్లు మంజూరుచేయాలి. ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం ఇండ్లు తొలగించేవారిని గుర్తించి న్యాయం చేయాలి. గతంలో అనేకసార్లు సర్వే చేసినా న్యాయం జరగలేదు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా న్యాయం చేయాలి. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!