నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-05-14T06:22:10+05:30 IST
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ ఏ సంధ్యారాణి, సీఐ రామలింగారెడ్డి హెచ్చరించారు.
హుజూర్‌నగర్ , మే 13: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ ఏ సంధ్యారాణి, సీఐ రామలింగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని రైతువేదికలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇష్టానుసారంగా విత్తనాలు విక్రయించి రైతులను మోసగించొద్దన్నారు. యాసంగి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. లైసెన్సు లేకుండా విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, ఏవో స్వర్ణ, నరేష్‌గౌడ్, సతీష్, భవానీశంకర్, గంధం శ్రీనివాస్, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట్‌రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.

