వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2022-05-14T06:36:49+05:30
వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని నెమ్మికల్‌లో ఏనుబాముల గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
ఆత్మకూర్(ఎస్), మే 13: వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని నెమ్మికల్‌లో ఏనుబాముల గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. వరి సాగుచేయొద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో 20లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేయ లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈనెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వ హించే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పందిరి రాంరెడ్డి, కాప రవి, చలమల్ల నర్సింహ, చారి, పరిపూర్ణాచారి పాల్గొన్నారు.
‘తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలి’
హుజూర్‌నగర్ : రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి, రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన రెండో రోజు బీజేపీ నియోజకవర్గ శిక్షణా తరగతుల్లో వారు మాట్లాడారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిల ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో పెనుమార్పులు వచ్చాయన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో చంద్రారెడ్డి, శేఖర్‌రెడ్డి, కోటిరెడ్డి, ఉమామహేశ్వరరావు, లచ్చిరెడ్డి,వీరబాబు, విజయ్, నరేష్, కోటయ్య, విజయ్, భాస్కర్‌రెడ్డి, శ్రీను, నాగమణి పాల్గొన్నారు.