సూర్యాపేటకు ‘ప్రగతి’ పురస్కారం
ABN , First Publish Date - 2022-05-14T06:51:07+05:30 IST
సూర్యాపేట మునిసిపాలిటీకి ‘ప్రగతి’ పురస్కా రం లభించింది.
సూర్యాపేటటౌన్, మే 13: సూర్యాపేట మునిసిపాలిటీకి ‘ప్రగతి’ పురస్కా రం లభించింది. లక్షపైన జనాభా ఉన్న మునిసిపాలిటీల్లో ఆదాయం పెంచుకోవడంలో చేసిన కృషికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నుంచి మునిసిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ ప్రశంసాపత్రం, మెమోంటో అందుకున్నారు. కాగా, సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా మారనుందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కార్యక్రమంలో అరవింద్‌కుమార్, సత్యనారాయణ, రామాంజులరెడ్డి పాల్గొన్నారు.

