కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-14T06:28:40+05:30 IST

మట్టపల్లి క్షేత్రంలో నృసింహుని అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి.శుక్రవారం పరమపదోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహంచారు.

కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

మఠంపల్లి, మే 13: మట్టపల్లి క్షేత్రంలో నృసింహుని అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి.శుక్రవారం పరమపదోత్సవాన్ని  అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు, వేదమంత్ర పఠనాలు గావించారు. అధ్యయనోత్సవాల్లో  చివరిరోజు శనివారం  సాత్రుమురై  ముగింపు ఉంటుందని, అనంతరం తిరు కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సరికొండ నవీన్‌లు తెలిపారు. . 


Read more