రోడ్ల మరమ్మతుకు ఎమ్మెల్యే చొరవ
ABN, First Publish Date - 2022-05-14T06:29:34+05:30
కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో రోడ్ల మరమ్మతుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చొరవ తీసుకున్నారని ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు తెలిపారు.
కోదాడ రూరల్, మే 13: కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో రోడ్ల మరమ్మతుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చొరవ తీసుకున్నారని ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు తెలిపారు. రోడ్ల దుస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడా రన్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు.