నేడు సాగర్‌కు కేటీఆర్
ABN , First Publish Date - 2022-05-14T06:46:40+05:30 IST
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నాగార్జు నసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జీవన్‌పాటిల్, ఎమ్మెల్యే నోముల భగత్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
హాలియాలో బహిరంగ సభ
నాగార్జునసాగర్, హాలియా, మే 13: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నాగార్జు నసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాగార్జునసాగర్, హాలియా మునిసిపాలిటీల్లో కేటీఆర్ శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎమ్మెల్యే నో ముల భగత్ శుక్రవారం పర్యవేక్షించారు. హాలియాలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం మధ్యాహ్నం నిర్వహించే బహిరంగసభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. వేసవిలో ప్రజలు, కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శామియానాలు ఏర్పాటుచేశారు. అదే విధంగా సాగర్ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును మంత్రి సందర్శిస్తారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో 600మంది సిబ్బంది, నలుగురు డీఎస్పీలు, 26మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు బందోబస్తులో పాల్గొననున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో బుద్ధవనం ప్ర త్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, డాక్టర్ ఈమ ని శివనాగిరెడ్డి, ఆర్డీవో రోహిత్‌సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ సురే్‌షకుమార్, తహసీల్దార్ మంగా, కమిషనర్ వేమనారెడ్డి ఉన్నారు.

