పరిహారం ఇవ్వకుండా కేసీఆర్‌ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-14T06:54:11+05:30 IST

మల్లన్నసాగర్‌ తరహాలో డిండి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు.

పరిహారం ఇవ్వకుండా కేసీఆర్‌ నిర్లక్ష్యం
చర్లగూడెం రిజర్వాయర్‌ వద్ద భూనిర్వాసితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న

మల్లన్నసాగర్‌ తరహాలో న్యాయం చేయాలి

 డిండి నిర్వాసితులకు తీన్మార్‌ మల్లన్న మద్దతు

మర్రిగూడ, మే 13: మల్లన్నసాగర్‌ తరహాలో డిండి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భా గంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోయిన భూనిర్వాసితులు చర్లగూడెం రిజర్వాయర్‌ క్యాంపు కార్యాలయం వద్ద నాలుగు రోజులుగా చేస్తున్న ధర్నాకు శుక్రవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు తరహాలో ఈ ప్రాంత బాధిత నిర్వాసితులకు పరిహారం అందించకుండా సీఎం నిర్ల క్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. డిండి ప్రాజెక్టు నిర్మాణం 3,600 ఎకరా ల్లో విస్తరించి ఉండగా, వెంకెపల్లి, వెంకెపల్లితండా, చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయన్నారు. డిండి లిప్టు ఇరిగేషన్‌ కింద ఇరిగేషన్‌ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 1080 గృహాలను పరిహారానికి అర్హులుగా గుర్తించినా ఇప్పటివరకు పరిహారం అందించకపోవడం బాధాకరమన్నారు. భూనిర్వాసితులు అధైర్యపడకుం డా పరిహారం ఇచ్చేంతవరకు ధర్నాను కొనసాగించడమే కాకుండా పనులను అడ్డుకోవాలని మల్లన్న సూచించారు. పనులను అడ్డుకున్నప్పుడే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. భూ నిర్వాసితులు చేస్తున్న ధర్నాను విచ్ఛి న్నం చేయడానికి అధికారులు పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయ డం బాధాకరమన్నారు. భూనిర్వాసితులకు రావాల్సిన పరిహారంపై కోర్టు కు వెళ్లే హక్కు ఉందని, కోర్టు ద్వారానే పరిష్కారమవుతుందని, కోర్టు తీర్పు వచ్చేవరకూ ధర్నా విరమించకూడదని సూచించారు.  ధర్నా కార్యక్రమంలో నాలుగు గ్రామాలకు చెందిన భూనిర్వాసితులు పాల్గొన్నారు. 

Read more